టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ - హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ అన్నీ వచ్చేశాయ్. ముందుగా అనుకున్నట్లే ఇది ఎర్రచందనం నేపథ్యంతో సాగే కథే అని తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. మరోవైపు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో ఓరల్‌గా పాన్ ఇండియా చిత్రంగా ‘పుష్ప’ విడుదల కాబోతోంది. అయితే హీరో పాత్రేంటో లుక్‌ను బట్టి అందరికీ బన్నీ కరుడు గట్టిన దొంగ అని తెలిసిపోయింది. మరి రష్మిక సంగతేంటి..? ఆ బ్యూటీ పాత్ర ఎలా ఉంటుంది..? సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవరు సైడ్ అయ్యారు..? అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ హాట్ టాపిక్‌గా నడుస్తున్నాయి.
ఇంట్రెస్టింగ్.. షాకింగ్!
తాజాగా.. ఇదిగో రష్మిక పాత్ర ఇలాంటి పాత్ర చేయబోతోంది..? ఇదే ఆమె పాత్ర అంటూ పుకార్లు వచ్చేస్తున్నాయ్. రష్మిక పాత్ర కూడా బన్నీ కంటే డిఫరెంట్‌గా ఉంటుందట. బన్నీ ఎర్ర చందనం కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ ఓ రోజు గిరిజన యువతి కనిపిస్తుందట. ఆ యువతే రష్మిక అట. అలా వారిద్దరూ ప్రేమలో పడతారట. కథ అలా సాఫీగా నడుస్తున్న టైమ్‌లో ఆమె పాత్రలో ఉండే ట్విస్ట్ ఆడియన్స్‌కి ఊహించని షాకింగ్ ఇస్తుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఆ షాకింగ్ సన్నివేశాల తర్వాత సినిమా ఓ రేంజ్‌కు వెళ్తుందట. సినిమా మొత్తమ్మీద ఈ బ్యూటీ పాత్రే హైలైట్‌గా నిలుస్తుందట. అయితే.. రష్మిక పోలీస్ ఆఫీసర్ అయితే.. గిరిజన యువతిగా అవతారమెత్తిందా..? లేకుంటే నిజంగానే గిరిజన యువతా..? అనేదే సుమారు 15 నిమిషాల పాటు సినిమా నడుస్తుందట.
నిజమేనా!?
కాగా.. ఇప్పటి వరకూ రష్మిక నటించిన సినిమాల్లోని పాత్రలన్నీ ఒక ఎత్తు.. బన్నీ సినిమాలో నటించే పాత్ర మాత్రం కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోతుందనే టాక్ టాలీవుడ్‌లో గట్టిగానే నడుస్తోంది. ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ మరింత పెరుగుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో..? అసలు రష్మిక పాత్ర ఇలా ఉంటుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదేమో మరి.!