Advertisementt

‘RRR’ కోసం చిరంజీవి రెక్వెస్ట్.. జక్కన్న రిజెక్ట్!

Thu 16th Apr 2020 02:19 PM
chiru request,megastar chiranjeevi,rrr movie,jakkanna reject,chiru and rajamouli  ‘RRR’ కోసం చిరంజీవి రెక్వెస్ట్.. జక్కన్న రిజెక్ట్!
Chiru Request Over RRR.. Jakkanna Rejected! ‘RRR’ కోసం చిరంజీవి రెక్వెస్ట్.. జక్కన్న రిజెక్ట్!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. సినిమా షూటింగ్ ఆగినా పుకార్లు మాత్రం అస్సలు ఆగలేదు.. రోజుకో పుకారు పట్టుకొస్తోంది. తాజాగా.. RRR విషయంలో జక్కన్నను మెగాస్టార్ రెక్వెస్ట్ చేశారని.. అయితే రాజమౌళి మాత్రం కుదరదని రిజెక్ట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇదీ అసలు కథ..!

జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న విషయం విదితమే. అయితే ఆయనకంటే ముందు.. తర్వాత చాలా మంది ఈ సినిమా తమకు ఇవ్వాలని రాజమౌళిపై ఒత్తిడి తెచ్చారట. అయినప్పటికీ జక్కన్న మాత్రం అస్సలు కుదరదని తేల్చి చెప్పేశారట. అయితే ఆ జాబితాలో మెగాస్టార్ పేరు కూడా ఉందట. ప్రత్యేకంగా ఒకట్రెండు సార్లు డైరెక్టర్‌తో చిరు చర్చించినప్పటికీ సారీ సార్.. ముందే చెప్పొచ్చుగా.. ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయిందిగా అని సున్నితంగా తిరస్కరించాడట. చిరు తర్వాత కూడా ‘బాహుబలి’ నిర్మాతలు కూడా సంప్రదించినప్పటికీ వారి పరిస్థితీ అదేనని తెలిసింది.

ఆశపడ్డాడేమో!?

ఇదిలా ఉంటే.. రాజకీయాలకు రాంరాం చెప్పి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాన్న కోసం రామ్ చరణ్ నిర్మాతగా కూడా మారాడు. ఇప్పటికి నాన్న సినిమాలను మెగా పవర్ స్టార్ ప్రొడ్యూస్ చేశాడు కూడా. అయితే.. ఇంతవరకూ తన సినిమాలన్నీ చెర్రీనే ప్రొడ్యూస్ చేయగా.. ఈ ఒక్క సినిమా, పైగా భారీ బడ్జెట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలని చిరు ఆశపడి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదమో. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

Chiru Request Over RRR.. Jakkanna Rejected!:

Chiru Request Over RRR.. Jakkanna Rejected!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ