ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ కానివ్వండి, జబర్దస్త్ కానివ్వండి.. వేటికవే సాటి. ఢీ షో లో డాన్స్ లతో స్టేజ్ అదిరిపోతే... జబర్దస్త్ స్టేజ్ నవ్వులు పూయిస్తుంది. ఈ రెండు షోస్ లో యాంకర్ రష్మీ యాంకరింగ్ చేస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కి హాట్ యాంకర్ గా రష్మి అదరగొడుతుండగా.. ఢీ షో కి సుధీర్ తో కలిసి రష్మీ యాంకరింగ్ చేస్తుంది. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న రష్మీ గౌతమ్ తాజాగా పేస్ బుక్ లైవ్ లోకి రాగా.. కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఫన్నీగాను, కాస్త కోపం గాను సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఢీ, జబర్దస్ షోలలో మిమ్మల్ని ఓ షో ఎంచుకోమంటే ఏం చెబుతారని అడగగా. రెండు షోస్ లో రష్మీకి మంచి పేరొచ్చింది.. ఏం చెబుతుందా అని చూడగా.. రష్మీ మాత్రం జబర్దస్త్ అంటూ టక్కున సమాధానము చెప్పింది.
ఇక మీరు లవ్ లో ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫీలయ్యారని అడిగితే.. నా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ పబ్లిక్‌లో మాట్లాడనని చెప్పాను.. ఇప్పుడూ అదే చెబుతున్నా అంటూ సమాధానం చెప్పింది. ఇక సుధీర్ తో షోస్ చేసేటప్పుడు ఎలా ఫీలవుతారని అడగగా... చాలా కంఫర్ట్ గా ఫీలవుతా అని చెప్పింది. ఇక సుధీర్ తో మీ పేరు లింక్ అయి ప్రచారం జరుగుతుంది కదా మీ ఫీలింగ్ ఏమిటి అంటే.. తెలియదు అని చెప్పిన రష్మీ.. సుధీర్ ని పెళ్లి చేసుకుంటారా? సుధీర్ తో టీవీ షోస్ కోసం టైం పాస్ చేస్తున్నారా? మీ అభిప్రాయమేమిటి అనగా.. గాసిప్ మాట్లాడడం మీకు నచ్చుతుందేమో.. నాకు నచ్చదు కాబట్టి నీ పని నువ్వు చూసుకో అంటూ ఘాటుగా స్పందించింది.