అవును మీరు వింటున్నది నిజమే. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు టార్గెట్ పెట్టుకున్నాడట. కచ్చితంగా ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాడట. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే చేసి తీరాల్సిందేనని గట్టిగా అనుకున్నాడట. విశేషమేమిటంటే.. అప్పుడెప్పుడో వంశీ పైడిపల్లితో ఆగిపోయిన కథను కూడా లైన్‌లోకి తీసుకొచ్చాడట. మరోవైపు ‘గీతా గోవిందం’ సినిమా డైరెక్టర్ పరుశురామ్ కూడా కచ్చితంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరు దర్శకులతో రెండు సినిమాలు ఉంటాయన్న మాట.
వాస్తవానికి ‘మహర్షి’ తర్వాత మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నప్పటికీ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి రంగంలోకి దిగి ఆ అవకాశాన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత అయినా చేద్దామనుకుంటే అస్సలు వర్కవుట్ అవ్వకపోగా.. ఇద్దరి మధ్య క్లాష్ వచ్చిందని కూడా వార్తలు వినిపించాయి. దీంతో చేసేదేమీ లేక ఘట్టమనేని కాంపౌండ్‌ను వదిలేసిన వంశీ.. మెగా కాంపౌండ్‌లో పడ్డాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. మహేశ్-వంశీని లాక్‌డౌన్ దగ్గర చేసిందట. మళ్లీ ఇద్దరూ కలిసి కథ గురించి చర్చించి ఒకట్రెండు మార్పులు చేర్పులు చేయాలని మాట్లాడుకున్నారట. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే లాక్‌డౌన్ అనంతరం షూటింగ్ షురూ కానుందన్న మాట.
ఇక పరుశురామ్ విషయానికొస్తే.. వంశీ సినిమా టైమ్‌లో బ్రేక్ దొరికినప్పుడల్లా ఈ షూటింగ్‌లో గడపాలని.. లేదా రెండు సినిమాలు ఒకేసారే స్టార్ట్ చేసేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని పరుశురామ్‌కు మహి హామీ ఇవ్వడంతో ఎప్పుడైనా తాను రెడీగానే ఉన్నట్లు చెప్పాడట. సో మొత్తానికి చూస్తే లాక్‌డౌన్ అనేది మిగిలిన నటీనటులకు ఏ మాత్రం వర్కవుట్ అయిందేమో లేదో తెలియట్లేదు కానీ.. మహేశ్ మాత్రం బాగానే సద్వినియోగం చేసుకుని రెండు మంచి నిర్ణయాలు తీసుకున్నాడన్న మాట.
నిజంగా.. ఈ రెండు విషయాలు మహేశ్ అభిమానులు ఎగిరి గంతేసే శుభార్తలే. చాలా రోజులుగా కథ విషయంలో అలా జరుగుతోంది..? ఇలా జరుగుతోంది..? అని వార్తలు రాగా.. తాజాగా వచ్చిన వార్తలతో అవన్నీ మరుగున పడిపోనున్నాయ్ అన్న మాట. మరి ఈ రెండు కథల విషయాల్లో నిజానిజాలు ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చి కొబ్బరికాయ కొట్టేంతవరకూ వేచి చూడాల్సిందే.