ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trivikram and jr ntr Film Latest Update

త్రివిక్రమ్.. సంజయ్‌దత్‌ని సెట్ చేస్తున్నాడంట!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే ‘అయినను పోయిరావలె హస్తినకు’ (వర్కింగ్ టైటిల్) సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. మాములుగా అయితే ఈ మే నుండి ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. RRR షూటింగ్ చివరి దశలో ఉండడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీని ప్రకటించాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ పకడ్బందీగా లాక్ చేసాడట. ఇక నటీనటుల ఎంపిక కూడా చేపట్టిన త్రివిక్రమ్ విలన్ కేరెక్టర్‌ని స్ట్రాంగ్ గా రాసుకున్నాడట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ పాత్ర స్ట్రాంగ్‌గా ఉండబోతుంది.

అయితే ఆ పాత్ర పక్కా రాజకీయాలతో ముడి పడి ఉంటుందని.. అందుకే ఆ పాత్రకి బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసేలా ఎన్టీఆర్ పాత్రను రాస్తున్నాడట త్రివిక్రమ్. ఇక విలన్ పాత్ర కోసం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మైండ్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉన్నాడట. సంజయ్ దత్‌ని మనసులో ఉంచుకునే త్రివిక్రమ్ ఆ పాత్రని రాసుకున్నాడట. ఇక త్రివిక్రమ్ గత సినిమాల వలే.. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌, రెండవ హీరోయిన్ పూజ హెగ్డే అంటూ ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. అయితే ఇవన్నీ చూస్తుంటే మాత్రం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా ప్లాన్‌లో ఉన్నారేమో అనిపిస్తుంది.

sanjay dutt for Trivikram and jr ntr next Film

Trivikram and jr ntr Film Latest Update
sanjay dutt
jr ntr
trivikram
bollywood
pan india