Advertisementt

నా కెరీర్లో అదో గొప్ప అవకాశం.. వెన్నెల కిషోర్

Tue 14th Apr 2020 02:00 PM
megastar chiranjeevi,vennela kishore,sunil,  నా కెరీర్లో అదో గొప్ప అవకాశం.. వెన్నెల కిషోర్
This is greatest opportunity in my career నా కెరీర్లో అదో గొప్ప అవకాశం.. వెన్నెల కిషోర్
Advertisement
Ads by CJ

వెన్నెల సినిమాతో కమెడియన్ ఎంట్రీ ఇచ్చిన కిషోర్, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్ గా మారిపోయాడు. ప్రతీ ఒక కమెడియన్ ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ కమెడియన్ ని గుర్తుచేసుకోగానే అదే గుర్తొస్తూ ఉంటుంది. వెన్నెల కిషోర్ తన కెరీర్లో అలాంటివెన్నో గుర్తింపుగల పాత్రలు చేశాడు. కానీ మొదటి సినిమా వెన్నెల లోని కిషోర్ పలికిన డైలాగ్ ని ఎప్పటికీ మర్చిపోలేరు.

కమెడియన్ సునీల్ హీరోగా మారి వెళ్లిపోయిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసి కమెడియన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తెలుగులో విడుదలయ్యే సినిమాల్లో దాదాపు ప్రతీ సినిమాలో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. అయితే ఎన్ని పెద్ద పెద్ద సినిమాల్లో నటించినా నటుడిగా కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో చేయాలనో, లేదా ఫలానా హీరో పక్కన కనబడాలనో ఉంటుంది.

వెన్నల కిషోర్ కి కూడా అలానే ఉండేదట. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో అవకాశం రావడంతో ఆ కోరిక తీరిందని అంటున్నాడు. తన కెరీర్లో ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నానని తెలిపాడు. కెరీర్లో ఎన్నో పాత్రలు చేసినా మెగాస్టార్ పక్కన చేయడం మరిచిపోలేనని చెప్పాడు.

This is greatest opportunity in my career:

That is the greatest opportunity to act with Megastar Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ