Advertisementt

బాలీవుడ్ హీరోని బాగా లేపుతుందిగా..!

Tue 14th Apr 2020 02:54 PM
pooja hegde,salman khan,bollywood,heroine,acting  బాలీవుడ్ హీరోని బాగా లేపుతుందిగా..!
Pooja Hegde Talks About Salman Khan బాలీవుడ్ హీరోని బాగా లేపుతుందిగా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ రేంజ్ లో దూసుకెళుతున్న పూజా హెగ్డే కి తెలుగులో తిరుగులేదు. ఇంతవరకు సౌత్ సినిమాలైనా తెలుగులోనే హావా నడిపించిన పూజా హెగ్డే త్వరలోనే తమిళ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఇక తెలుగులో సక్సెస్ అవుతున్నప్పటికీ... అప్పుడప్పుడు బాలీవుడ్ పై కన్నేస్తున్న పూజా హెగ్డే గత ఏడాది హౌస్ ఫుల్ 4 తో సూపర్ హిట్ కొట్టడంతో  స్టార్ హీరోల చూపు పూజా హెగ్డే పై పడింది. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ సినిమాలో పూజా హెగ్డే అవకాశం కొట్టేసింది. మరి స్టార్ హీరో సల్మాన్ సరసన అవకాశం అంటే మాములు విషయం కాదు. అదే విషయం పూజా కూడా ఒప్పుకుంటుంది. కబీ ఈద్ కబీ దివాళి సినిమాలో సల్మాన్ తో నటించడంపై పూజ ఏమంటుందంటే...

సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నా అని.. సల్మాన్ ఖాన్ తో నటించడం అంటే మనలోని టాలెంట్ కి ఇంకాస్త మెరుగు దిద్దుకోవాలని అర్ధం అని.. సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్ల నుండి సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాల అనుభవం ముందు మనమెంత అంటుంది పూజా హెగ్డే. సల్మాన్ అనుభవం ముందు నటించడానికి కాస్త భయంగానే ఉందని...అగ్రనటులతో కలిసి నటించే ముందు ఇలానే ఉంటుందేమో అంటుంది. ఇక నటనలో మెళుకువలు నేర్చుకోవడానికి సల్మాన్ తో పని చెయ్యడం  ఓ అదృష్టమని... ఇక సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ కథ చాలా ఫన్నీగా... కూల్ గా ఉంటుందని చెబుతుంది. ఇక ఆగస్టు నుండి ఈ సినిమా సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది.. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన అది రీ షెడ్యూల్ అవ్వోచ్చేమో అంటుంది పూజా హెగ్డే.

Pooja Hegde Talks About Salman Khan:

Pooja Hegde got Chance in Salman khan Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ