Advertisementt

మళ్ళీ కొరియన్ రీమేక్ తో రానున్న కాంబినేషన్..?

Mon 13th Apr 2020 05:07 PM
samantha,nandini reddy,naga chaitanya  మళ్ళీ కొరియన్ రీమేక్ తో రానున్న కాంబినేషన్..?
Once more that combo repeat..? మళ్ళీ కొరియన్ రీమేక్ తో రానున్న కాంబినేషన్..?
Advertisement
Ads by CJ

తెలుగులో రీమేక్ చిత్రాల సంఖ్య బాగా పెరిగింది. ఇటు తెలుగు నుండి ఇతర భాషల్లో రీమేక్ అయ్యే చిత్రాలతో పాటు, ఇతర భాషల నుండి తెలుగులో రీమేక్ అయ్యే చిత్రాలు కూడా పెరిగాయి. లాక్డౌన్ కారణంగా విడుదల తేదీలని మార్చుకున్న వాటిలో రీమేక్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలుగులో తెరకెక్కే రీమేక్ చిత్రాల సంఖ్యను పెంచుతూ మరో సినిమా యాడ్ అవబోతుంది. సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

సమంత లేడీ ఓరియంటెడ్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కొరియన్ చిత్రమైన మిస్ గ్రానీ సినిమాకి అఫీషియల్ రీమేక్. ఈ సినిమా విజయం సమంతలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది. అందుకే మళ్ళీ నందిని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. ఈ సారి కూడా కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఎమోషనల్ గా సాగే ఈ కథ సమంతకి బాగా సూటవుతుందట. ఇక ఈ మూవీలో హీరోగా నాగచైతన్యని తీసుకోవాలని చూస్తున్నారు. సమంత, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలని దక్కించుకోవడంతో, ఈ సినిమాలోనూ వారిద్దరు నటిస్తే బాగుంటుందని అనుకుంటుందట. ఇంకా స్క్రిప్టు పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి లాక్డౌన్ పూర్తయ్యాక అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

Once more that combo repeat..?:

Samantha, Nandini reddy teamed up again for korean remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ