RRR డబ్బింగ్ పనులు స్టార్ట్..?

కరోనా ఎఫెక్ట్ వల్ల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్, అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టం అని వార్తలు వస్తున్నాయి. దీంతో రాజమౌళి చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు.  లాక్డౌన్ సమయంలో మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసిన చిత్ర బృందం, డబ్బింగ్ పనులని స్టార్ట్ చేసిందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం కాకుండా ఉండడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట. 

అందుకే ఎవరి ఇళ్లలో వారు ఉండి డబ్బింగ్ పనులని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందుకోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి క్వాలిటీ మైక్ పంపించాడని సమాచారం. డబ్బింగ్ కి కావాల్సిన థియేటర్ తో పాటు అన్ని సౌకర్యాలు ఇద్దరు హీరోల ఇళ్ళలో ఉండడంతో రాజమౌళి ఆ దిశగా అడుగేసాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కూడా డబ్బింగ్ జరుపుకుంటుందట. ఈ ప్రాసెస్ ని రాజమౌళి, మదన్ కార్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూపర్ విజన్ చేస్తున్నారట.

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడుతుందని వార్తలు సమయంలో రాజమౌళి పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా అనుకున్న సమయానికే విడుదల చేసేలా కనబడుతున్నాడు. 

RRR dubbing work started

RRR dubbing works started..?
rrr
ramcharan
ntr
rajamouli