Advertisementt

ఈ జ‌న్మ‌కి ఇది చాలంటున్న చిరు అభిమాని

Tue 14th Apr 2020 12:44 PM
chiranjeevi,surekha,rajanala naga lakshmi,happy,tears,mega star  ఈ జ‌న్మ‌కి ఇది చాలంటున్న చిరు అభిమాని
Chiru and Surekha video call to mega fan naga lakshmi ఈ జ‌న్మ‌కి ఇది చాలంటున్న చిరు అభిమాని
Advertisement
Ads by CJ

ఈ జ‌న్మ‌కిది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి అనే ఆమెకు స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం రాజనాల నాగలక్ష్మిగారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్ వారు ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి శ్రీమతి సురేఖ స్వయంగా నాగలక్ష్మితో వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆరోగ్యంగా ఉన్నార‌ని.. ఏం కాద‌ని మీకు మేము ఉన్నామంటూ చిరంజీవి దంప‌తులు ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. ఇది క‌లా..నిజ‌మా?  నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖగారు కూడా కుటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్రేమ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవిగారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నానని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌ధులిచ్చారు.

Chiru and Surekha video call to mega fan naga lakshmi:

Nagalakshmi Rajanala response on Chiru and surekha video call

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ