దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. తెలుగులో చాలా మంది దర్శకులు ఇలా నిర్మాతలుగా మారారు. తాము దర్శకత్వం వహించడానికి కుదరని సబ్జెక్టులని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలుగా మారుతున్నారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ నుండి మొదలుకుని..ఇప్పుడు సుకుమార్ వరకు ఇలాగే చేస్తున్నారు. బేసిగ్గా రచయితలయిన దర్శకుల వద్ద చాలా కథలు ఉంటాయి.
వారికి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అన్ని కథలని సినిమాలుగా తీయలేరు. అందుకే వేరే దర్శకుల ద్వారా తెరకెక్కించి తమ కథల్ని తెర మీద చూసుకుంటారు. తాజా సమాచారం ప్రకారం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారుతున్నాడు. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. కెరీర్లో ఇప్పటి వరకు అపజయాన్ని చూడలేదు. చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ అవుతుంది.
వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న కొరటాల నిర్మాతగా మారి తన అసిస్టెంట్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట. తన టీంలోని లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కి దర్శకురాలిగా అవకాశం ఇవ్వనున్నాడట. ఈ విషయమై లాక్డౌన్ తర్వాత అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. దర్శకుడిగా బ్లాక్ బస్టర్లు తీసిన కొరటాల నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదా చూడాలి.