తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు, అందాల భామ శ్రుతి హాసన్ నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీమంతుడు’. యాక్షన్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను దున్నేసింది. అప్పట్లో అలా థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం మరోసారి రికార్డ్ బ్రేక్ చేసింది. 2017 సెప్టెంబర్-03న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఇప్పటి వరకూ 99,259,327 మంది వీక్షించారు. అంటే.. వందమిలియన్ వ్యూస్ అతి చేరులో వుందన్న మాట. ఆల్ రికార్డే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
తాజాగా శ్రీమంతుడు..
కాగా.. ఈ రేంజ్‌లో వ్యూస్‌ని సంపాదించిన మొదటి తెలుగు మూవీగా ‘శ్రీమంతుడు’ నిలవడం నిజంగా మహేశ్, ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహేశ్ సినిమాల విషయంపై చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తాజా రికార్డ్‌తో ఆ పుకార్లన్నీ కొద్దిరోజులు మూలపడనున్నాయి. లాక్ డౌన్ కాలం కూడా మహేశ్‌కు అలా కాలం కలిసొస్తోందన్న మాట. ఒక్క యూట్యూబ్‌లోనే కాదు.. ట్విట్టర్‌లోనూ ‘శ్రీమంతుడు’ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా 2015 రూపొందిన శ్రీమంతుడు చిత్రం తన తండ్రి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా అప్పట్లోనే థియేటర్లలో రికార్డ్ సృష్టించి రూ2.0 బిలియన్లు కలెక్షన్లు వసూలు చేసిందని చెబుతుంటారు.
ఇటీవలే టీవీల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దద్దరిల్లింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఉగాది పర్వదినాన మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఉగాది రోజున టెలివిజన్ ప్రీమియర్‌గా మార్చి 25న జెమినీ టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అందరూ ఇళ్లలో ఉండటం.. పైగా మహేశ్ సినిమా కావడంతో తెగ చూసేశారు. ఇప్పటివరకూ 22.70 టీఆర్పీతో ‘బాహుబలి-2’ అగ్ర స్థానంలో ఉండగా.. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 23.4 టీఆర్పీని సాధించింది. కాగా.. మొదట బాహుబలి-01 రికార్డ్‌ను ‘బాహుబలి-2 బద్ధలు కొట్టగా.. ఆ రెండు రికార్డ్స్‌ను తిరగరాసి ‘సరిలేరు నాకెవ్వరు’ అని మహేశ్ అనిపించుకున్నాడన్న మాట.
సినిమా కోసం క్లిక్ చేయండి..