టాలీవుడ్‌లో రష్మిక మందన్నా రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. కన్నడలో కూడా మంచి ఫాలోయింగ్‌తో మంచి మంచి కథలను ఎంచుకుని చేస్తోంది ఈ భామ. తాజాగా ఆ భామ నటించిన ‘పొగరు’ సినిమా కాంట్రవర్సీగా మారింది. దీంతో మహిళా సంఘాలు ఒంటికాలిపై లేస్తున్నాయ్. ఇంతకీ ఈ వివాదం ఎందుకొచ్చింది..? కరోనా లాక్‌డౌన్‌లోనూ ఎందుకింత హడావుడి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సరిలేరుకు మొత్తం రివర్స్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో రష్మిక పాత్ర ఎలా ఉందో.. మూవీ చూసినోళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. మహేశ్‌ను ప్రేమలో పడేసేందుకు రష్మిక నానా తంటాలు పడి.. ఆ ట్రైన్‌లో సీన్స్, మళ్లీ కర్నూలు వచ్చిన తర్వాత సీన్స్ అందరికీ గుర్తుండే ఉంటాయ్. మరీ ముఖ్యంగా ‘మీకు అర్థమవుతోందా’ అని స్వీట్‌గా రష్మిక చెప్పిన డైలాగ్ అయితే అదుర్స్ అంతే. అయితే.. ఈ సినిమాలో మాదిరి కాకుండా ఈ ముద్దుగుమ్మ కన్నడలో ధృవ సర్జా సరసన ‘పొగరు’లో నటించింది.
వ్యూస్ మాత్రం గట్టిగానే..
అయితే ఈ మూవీలో మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’కు మొత్తం రివర్స్ అంటే.. హీరోయిన్ తనను ప్రేమించట్లేదని హీరో తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడు. సాంగ్‌లో హీరో బిహేవియర్, రౌడీల చిత్ర విచిత్రాలు.. ఫైరింగ్, కరెంట్ షాకిస్తున్నట్లు చూపించడం మరీ ఎబ్బెట్టుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించలేదని మరీ ఇంతలా ఏడిపిస్తారా..? బాబోయ్.. ఇది మరీ అరాచకం కదా..? అని జనాల మనసులో తడుతుంది. యూట్యూబ్‌లో చిత్రబృందం రిలీజే చేసిన ఈ సాంగ్‌ను జనాలు మాత్రం తెగ చూసేశారు. ఏప్రిల్-02న ఈ పాట రిలీజ్ చేయగా.. 8,708,931 అనగా ఎనిమిది మిలియన్ల పై చిలుకు వ్యూస్ వచ్చాయ్. మరోవైపు డిస్‌లైక్స్ కూడా గట్టిగానే ఉన్నాయ్.
తీసేస్తారో లేదా..!
అత్యంత రాక్షసంగా హీరోయిన్‌ను టీజ్ చేస్తున్నట్లు ఉన్న ఈ పాటను చూసిన మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పాట కాంట్రవర్సీ అయ్యింది. వెంటనే యూట్యూబ్ నుంచి అదే విధంగా సినిమా నుంచి సాంగ్‌ను తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలు అంటే మీకు అంత చులకనగా ఉందా..? అంటూ ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయ్. మరోవైపు.. ఇందుకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. మరి చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాలి.
కాంట్రవర్సీ అయిన సాంగ్ ఇదే..
https://www.youtube.com/watch?v=Ysf4QRrcLGM&feature=emb_logo