Advertisementt

బాలయ్య విలన్ రోజా కాదు.. ఎవరో తెలుసా?

Mon 13th Apr 2020 11:23 AM
bhumika,balakrishna,boyapati,villain,roja  బాలయ్య విలన్ రోజా కాదు.. ఎవరో తెలుసా?
Balayya and Boyapati Movie Villain Fixed బాలయ్య విలన్ రోజా కాదు.. ఎవరో తెలుసా?
Advertisement

బాలకృష్ణ - బోయపాటి కాంబో మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. అయితే బాలయ్య కి ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడి విలన్ గా అలాంటి హీరోయిన్.. ప్రస్తుతం రాజకీయాల్లో రఫ్ ఆడిస్తున్న రోజా నటిస్తుంది అని అన్నారు. బోయపాటి, రోజాని కలిసి బాలయ్య సినిమాలో విలన్ పాత్రలో నటించమని అడిగినట్లుగా.. రోజా కాదన్నట్లుగా వార్తలు రాగా.. రోజా తనని ఎవరూ విలన్ రోల్ చెయ్యడానికి సంప్రదించలేదని చెప్పింది. అయితే తాజాగా ఆ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలో మరో మాజీ హీరోయిన్ నటించబోతుందట.

ఆమె పవన్ కళ్యాణ్ ఖుషి హీరోయిన్ భూమిక అంటున్నారు. ఈమధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన భూమిక ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తుంది. తాజాగా తనకి నెగిటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్స్ అయితే ఇష్టమని.. అలాగే ఓ సినిమాలో తాను నెగెటివ్ కేరెక్టర్ చెయ్యబోతున్నట్టుగా చెప్పింది. అయితే భూమిక చెప్పిన ఆ సినిమా బాలయ్య - బోయపాటి సినిమానే అంటున్నారు. ఈమధ్యనే వచ్చిన బాలయ్య రూలర్ సినిమాలో భూమిక నటించింది. మళ్లీ బోయపాటి సినిమాలో భూమిక విలన్‌గా బాలయ్యని ఢీ కొట్టబోతుందట. మరి బోయపాటి సినిమాల్లో విలన్ రోల్స్ ఎలా ఉంటాయో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని బట్టి భూమికకు ఓ మంచి విలన్ రోల్ దొరికినట్లే అంటున్నారు. 

Balayya and Boyapati Movie Villain Fixed:

Bhumika in Balayya and Boyapati Movie Villain role 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement