Advertisementt

‘పుష్ప’.. హీరోయిన్ సంగతేంటి?

Sat 11th Apr 2020 11:16 PM
pushpa,rashmika mandanna,pan india craze,sukumar  ‘పుష్ప’.. హీరోయిన్ సంగతేంటి?
News on Pushpa Heroine Rashmika Mandanna ‘పుష్ప’.. హీరోయిన్ సంగతేంటి?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతుంది. ఈ విషయం తాజాగానే అనౌన్స్ చేసింది మూవీ టీం. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఫుల్లీ రివెంజ్ డ్రామాగా ఉండబోతుంది అని.. అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పక్ నారాయణ్ అని లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే సుక్కు - బన్నీ సినిమా ప్రకటన రోజునే ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా అనౌన్స్ చేసారు.

అయితే తాజాగా పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పారు కాబట్టి., ఈ సినిమాకి రష్మిక క్రేజ్ సరిపోతుందా? రశ్మికకి కన్నడ, తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది కానీ హిందీ, తమిళంలో రష్మిక కి క్రేజ్ లేదు. అలాంటి హీరోయిన్ ని పాన్ ఇండియా లెవల్లో తీసుకోవడం అనేది కరెక్టా... కాదా అనేది డౌట్. పాన్ ఇండియా ఫిలిం అనగానే బాలీవుడ్ హీరోయిన్స్ వెంటపడే దర్శకులున్న ఈ రోజుల్లో  సుకుమార్ కేవలం సౌత్ హీరోయిన్ అదీ.. ఓ అన్నంత క్రేజ్ లేని హీరోయిన్ నే పుష్ప సినిమా కోసం తీసుకోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. రష్మిక క్రేజ్ పాన్ ఇండియా ఫిలిం కి సరిపోతుందా.. ఆమెకి హిందీ లో ఎలాంటి క్రేజ్ లేకపోవడం సినిమాకి మైనస్ అవుతుంది అంటున్నారు నిపుణులు. మరి సుక్కు - బన్నీ ఇది ఆలోచించారా.. లేదా అనేది వాళ్ళకే తెలియాలి అంటున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. 

News on Pushpa Heroine Rashmika Mandanna:

Rashmika Mandanna in Pan India Film Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ