సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల మళ్ళీ వాయిదా పడేలా కనిపిస్తోంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయి, మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టత లేదు. కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ ని పెంచే అవకాశం ఉంది. నిజానికి ఈ సంవత్సరం జులైలో రావాల్సిన ఈ చిత్రం వచ్చే జనవరికి షిఫ్ట్ అయింది.
అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అయ్యేలా కనిపించడం లేదు. రాజమౌళి విడుదల విషయంలో ఎంత పట్టుదలగా ఉన్న సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ అయ్యే అవకాశాలే లేవు. ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ నటులతో పాటు హలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పుడప్పుడే అంతర్జాతీయ రాకపోకలకి అనుమతి వచ్చేలా కనబడనందున సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.
రెండు మూడు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో అర్ ఆర్ ఆర్ సంక్రాంతికి విడుదల కాదని చెబుతున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే ఆ స్థానంలోకి రావడానికి చాలా మందే చూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాడు.