Advertisementt

పుష్ప సినిమాలో ఐటెం సాంగ్..

Sat 11th Apr 2020 08:53 AM
allu arjun,pushpa,bunny,sukumar,devi sri prasad  పుష్ప సినిమాలో ఐటెం సాంగ్..
Item song in Pushapa movie పుష్ప సినిమాలో ఐటెం సాంగ్..
Advertisement
Ads by CJ

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతున్న రివేంజ్ డ్రామా పుష్ప సినిమా నుండి మరో అప్డేట్ వచ్చేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ చిత్తూరు జిల్లా ప్రాంతం వాడిగా కనిపించనున్నాడు. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న బన్నీ పుష్పలో ఐటెం సాంగ్ ఉండనుందట.

సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే చిత్రాలని మినహాయిస్తే సుకుమార్ తీసిన ప్రతీ చిత్రంలో ఐటెం సాంగ్ ఉంది. అలాగే పుష్ప సినిమాలోనూ ఐటెం సాంగ్ ఉండనుందట. ఈ పాటలో బన్నీ సరసన డాన్స్ చేయడానికి బాలీవుడ్ హీరోయిన్ ని దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారట.  ఆల్రెడీ ఈ పాట కోసం ట్యూన్ సిద్ధమైపోయిందని టాక్.

ఐటెం సాంగ్ తో పాటు పుష్ప అనే పేరు మీద టైటిల్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో చేస్తుండగా, విలన్ గా బాలీవుడ్ నటుడు చేయనున్నాడట. హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, సినిమాలో ఎక్కువభాగం కొత్తవారే కనిపించనున్నారు.

Item song in Pushapa movie:

Item song in Allu Arjun pushpa movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ