Advertisementt

చిరు అభిమానికి ఆపరేషన్ సక్సెస్

Sat 11th Apr 2020 11:05 PM
chiranjeevi,fan,naga lakshmi,rajanala,operation,success  చిరు అభిమానికి ఆపరేషన్ సక్సెస్
Operation Success to Chiranjeevi Fan చిరు అభిమానికి ఆపరేషన్ సక్సెస్
Advertisement
Ads by CJ

‘‘పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవిగారి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్  డైరెక్ట‌ర్  డాక్ట‌ర్  ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది అని స‌ర్జ‌రీ  చాలా విజయవంతం అయ్యిందని తెలిసింది. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్ ఫుల్‌గా ఆపరేషన్ జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు. 

ఆపరేషన్ పూర్తి అవ్వగానే మొదటి ఫోన్ డాక్ట‌ర్.. గోపీచంద్ గారు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి తెలియజేసారు. శ్రీ చిరంజీవి గారు చాలా సంతోషంతో ఆప‌రేష‌న్ విజయవంతం అయ్యిందని మా అందరికి తెలియజేసారు. శ్రీ చిరంజీవిగారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ముక్కోటి దేవతలను ప్రార్ధిద్దాము.’’  

రవణం స్వామినాయుడు 

అఖిల భారత చిరంజీవి యువత

 

మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. డాక్ట‌ర్ గోపీచంద్‌గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.. అన్నారు.

Operation Success to Chiranjeevi Fan :

Rajanala Nagalakshmi Operation success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ