Advertisementt

త్రిష అలా.. మెగాస్టార్ ఇలా.. అసలు కథేంటో!?

Sat 11th Apr 2020 10:56 PM
trisha,megastar chiranjeevi,reasons,acharya movie,koratala shiva  త్రిష అలా.. మెగాస్టార్ ఇలా.. అసలు కథేంటో!?
Trisha gives one reason, Chiranjeevi gives one reason త్రిష అలా.. మెగాస్టార్ ఇలా.. అసలు కథేంటో!?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బతో షూటింగ్ అయిపోయింది.‘ఆచార్య’ ఒక్కటే యావత్ సినీ ఇండస్ట్రీ షూటింగ్స్, రిలీజ్‌లను ఆపేసింది. అయితే ఇప్పటికీ ఈ సినిమాలో చిరు సరసన నటించేది ఎవరనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ సినిమా నుంచి సీనియర్ నటి, ముదరు భామ త్రిష ఎందుకు తప్పుకుంది..? కారణాలేంటి..? ఎక్కడ తేడా కొట్టింది..? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా త్రిష తప్పుకోవడంపై చిరంజీవి స్పందిస్తూ ఒకింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో త్రిష చెప్పిన కారణాలకు.. మెగాస్టార్ చెప్పిన కారణాలకు అస్సలు పొంతనే లేకపోవడం గమనార్హం.

చిరు మాటల్లోనే..!

‘నా సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలిసి షాకయ్యాను. త్రిషతో ఏమైన సమస్య ఉందా..? అని చిత్రబృందాన్ని అడిగాను. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు కాస్ట్యూమర్‌గా వ్యవహరిస్తున్న నా పెద్ద కుమార్తె సుస్మితా.. త్రిషకు సంబంధించి కాస్ట్ట్యూమ్స్ కూడా సిద్ధం చేసింది. అయితే ఏం జరిగింది..? ఎందుకు తప్పుకుందని తెలుసుకోగా.. ఆమె మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాకు సంతకం చేసినట్లు తెలిసింది. ఆ సినిమాకు డేట్స్ ఎక్కువగా ఇచ్చినట్లు తెలిసింది. క్రియేటివిటీ విషయంలో అస్సలు మా టీమ్‌తో ఎవరికీ ఎలాంటి విబేధాలు లేవు’ అని మెగాస్టార్ తేల్చిచెప్పారు. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘రామ్’, ‘గర్జనై’ ప్రాజెక్టులతో త్రిష బిజిబిజీగా ఉంది.

అప్పట్లో త్రిష ఏమంది..!?

‘కొన్నిసార్లు మనతో చర్చించిన విషయాలు ఒకటైతే.. వాస్తవంలో కనిపించేవి వేరేగా ఉంటాయి. చిరంజీవి సర్ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. కొన్ని క్రియేటివిటీ పరంగా ఉన్న విభేదాలే కారణం’ అని అప్పట్లో త్రిష ట్విట్టర్‌లో త్రిష రాసుకొచ్చింది. అంతేకాదు.. ప్రియమైన అభిమానులారా త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తానని చెప్పింది.

అస్సలు పొంతనే లేదుగా..!

మొత్తానికి చూస్తే త్రిష చెప్పిన విషయానికి.. మెగాస్టార్ చెప్పిన విషయాలకు అస్సలు పొంతనే లేదని వీరి రియాక్షన్‌ను బట్టి తెలుస్తోంది. అస్సలు వీరిరివురి కామెంట్స్‌కు అస్సలు సెట్ కాలేదు. సో.. దీన్ని బట్టి చూస్తే సమ్‌థింగ్.. సమ్ థింగ్ ఏదో తేడా కొడుతున్నట్లే అనిపిస్తోంది. మరి క్రియేటివిటీ అని తెగ కొట్టేసుకున్న త్రిష ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో.. ఇంకా ఎన్నెన్ని కథలు చెబుతుందో..? త్రిష తప్పుకోవడం వెనుక ఇంకా ఎన్నెన్ని జరిగాయో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ..!

Trisha gives one reason, Chiranjeevi gives one reason:

Trisha gives one reason, Chiranjeevi gives one reason  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ