దిల్ రాజు పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా నైజాం రైట్స్ వదలడు. ప్రతి సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను కొనేస్తాడు. లాభాలు వచ్చేవరకు వేరే సినిమాలను రానివ్వకుండా దిల్ రాజు ప్లాన్ చేస్తుంటాడు. ఇక రాజమౌళి సినిమా RRR ని కూడా దిల్ రాజు నైజాం రైట్స్ ని భారీ ధరకు కొనుగులు చేసాడు. బాహుబలి వ్యామోహం, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబో కనుక RRR నైజాం హక్కులను ఏకంగా 75 కోట్లకి కొనుగోలు చేసాడు. ఇప్పటికే దానయ్యకి 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు.
అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల వలన RRR సినిమా మాత్రమే కాదు... మరే సినిమా విడుదలైనా థియేటర్స్ కి జనాలు వచ్చేలా లేరు. అందుకే దిల్ రాజు RRR కి 75 కోట్లు ఇవ్వడానికి వెనుక ముందు ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే దిల్ రాజు.. దానయ్య, రాజమౌళితో చర్చలకు దిగాడని... ఒకసారి డీల్ పూర్తయ్యాక మళ్ళీ డిస్కషన్స్ ఏమిటి అంటూ దానయ్య ఫైర్ అవుతున్నాడని, వేరే బయ్యర్లతో పోటీ పడి 75 కోట్లకి హక్కులు కొని ఇప్పుడు మళ్ళీ బేరాలకి దిగడం ఏమిటంటున్నారట. అనుకున్న డీల్ కే కట్టుబడి ఉండాలని, లేదంటే డీల్ క్యాన్సిల్ చేసుకోవాలని అంటున్నారట. ఇక క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ.. ప్రస్తుతం అడ్వాన్స్ మాత్రం సినిమా విడుదలయ్యాకే అంటున్నారట. మరి రాజమౌళిని నమ్ముకుని దిల్ రాజు RRR విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయాడంటున్నారు.