సుకుమార్ - అల్లు అర్జున్ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. పుష్ప టైటిల్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా కథనం ప్రకారం పుష్ప స్టోరీ ఏమిటంటే.. రివేంజ్ స్టోరీగా ఈ సినిమా కథ ఉండబోతుంది అని సినిమా మొత్తం పగా ప్రతీకారాలు తీర్చుకోవడంతోనే సాగుతుంది అని అంటున్నారు.
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారి వలన పుష్పక్ నారాయణ్(అల్లు అర్జున్)కుటుంబానికి అన్యాయం జరుగుతుందట. దానితో పుష్ప లారీ డ్రైవర్ గా ఎర్ర చందనం స్మగ్లర్ బ్యాచ్ లో చేరి.. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారి ఆటకట్టించడంతో కథ ముగుస్తుంది అని.. మధ్యలో వచ్చే ట్విస్ట్ లు సినిమాకే హైలెట్ అంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప పాత్రకి రష్మిక పాత్ర సహాయంగా ఉంటుంది అని... ఎమోషన్ కి అవకాశం వుండే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ కథని సుక్కు రాసుకున్నాడని అంటున్నారు. మరి ఈ కథ నిజమా.. లేదా అనేది సినిమా విడుదలయ్యేవరకు సస్పెన్స్ గానే మిగులుతుంది.