Advertisementt

ఓ పోలీసు బిడ్డ‌గా పోలీసులకి సెల్యూట్: మెగాస్టార్

Fri 10th Apr 2020 07:55 PM
chiranjeevi,police,salute,police son,mega star,dgp,mahindar reddy  ఓ పోలీసు బిడ్డ‌గా పోలీసులకి సెల్యూట్: మెగాస్టార్
Chiranjeevi Salutes Police ఓ పోలీసు బిడ్డ‌గా పోలీసులకి సెల్యూట్: మెగాస్టార్
Advertisement
Ads by CJ

లాక్ డౌన్ నేప‌థ్యంలో తెలుగు రాష్ర్టాల్లో పోలీసులు ఎంత‌గా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. జిల్లాల బోర్డ‌ర్స్ లోనూ..రాష్ర్టాల స‌రిహ‌ద్దుల్లోనూ పోలీసులు నిద్రాహారాలు మాని క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు. ఇక నిరంత‌రం పల్లెటూళ్ల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కూ పోలీసులు రేయింబ‌వ‌ళ్లు ప‌హారా కాస్తూనే ఉన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి మేము సైతం అంటూ ప్రాణాల‌కు తెగించి ప‌నిచేస్తున్నారు. తాజాగా ఇదే స‌న్నివేశాన్ని స్వ‌యంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి పోలీసుల‌పై త‌న అభిప్రాయాన్ని ట్విట‌ర్ లో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.

‘‘రెండు తెలుగు రాష్ర్టాల పోలీసుల ప‌నితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు ప‌డుతోన్న క‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్ పోలీసుల‌ను చూస్తున్నాను. వారి ప‌ని తీరువ‌ల్ల లాక్ డౌన్ చాలా స‌క్సెస్ పుల్ గా జ‌రుగుతుంది. అలా జ‌ర‌గ‌బ‌ట్టే ఈ క‌రోనా విజృంభ‌ణ చాలా వ‌ర‌కూ అదుపులోకి వ‌చ్చింది. అలాగే నేను ప్ర‌తీ ఒక్క‌రికి వేడుకుంటున్నాను. సామాన్య జ‌నం కూడా పోలీసుల‌కి స‌హ‌క‌రించి ఈ క‌రోనాని అంత మొందించ‌డంలో వాళ్ల‌కి చేదోడు..వాదోడుగా మ‌నమంద‌రూ స‌హ‌క‌రించాలి. పోలీసులు చేస్తున్న ఈ అమోఘ‌మైన ప్ర‌య‌త్నానికి..వారికి ఓ పోలీసు బిడ్డ‌గా చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్’’ అని చిరంజీవి ఓ వీడియో ద్వారా మెసేజ్ షేర్ చేశారు.

ఆయన పోస్ట్ చేసిన ట్విట్టర్ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎమ్. మ‌హీంద‌ర్ రెడ్డి స్పందించారు. ‘‘మీరు మాకే  కాదు. మా పోలీసు ఫోర్స్ మొత్తానికి స్ఫూర్తి. పోలీసు కుటుంబానికి చెందిన స‌భ్యుడిగా మీ నుంచి ప్రేర‌ణ పొందిన వారంతా చాలా విష‌యాలు అర్ధం చేసుకుంటున్నారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కునే యుద్ధంలో మీ మాట‌లు అంద‌రికి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని తెలిపారు.

Chiranjeevi Salutes Police:

Chiranjeevi Lauds Police

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ