చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడింది. చిరు ఆచార్యలో మాస్ లీడర్ గా కనిపిస్తున్నాడు. అయితే కొరటాల - చిరు ఆచార్యలో ఓ గెస్ట్ రోల్ ఉందని ఆ రోల్ కి మహేష్ బాబుని అనుకున్నారని ప్రచారం జరిగినా.. చిరు అసలు ఆ రోల్ కోసం మహేష్ ని అడగలేదని.. మా సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ అనేది గాసిప్ మాత్రమే అని కొట్టిపారేశాడు. ఇక ఆ రోల్ ని ముందు నుండి రామ్ చరణ్ నే అనుకున్నామని రివీల్ చేసాడు.
దాని కోసం RRR డైరెక్టర్ రాజమౌళితో మాట్లాడి ఓ ముప్పై రోజుల డేట్స్ ని కూడా రామ్ చరణ్ కోసం తీసుకున్నామని చెప్పాడు. అయితే ఈ సినిమాలో నేను, రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటించడం లేదని.. గురు శిష్యులుగా మాత్రం కనిపిస్తామంటూ చరణ్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అనేది చిరు తాజాగా రివీల్ చేసేసాడు. మరి మహేష్ ఈ సినిమాలో అన్నప్పుడే మహేష్ స్టూడెంట్ అని.. చిరు ప్రొఫెసర్ అంటూ ప్రచారం జరగడం... ఇప్పుడు చిరు, చరణ్ రోల్ గురించి చెప్పిన దానికి సింక్ అవడం మాత్రం బావుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక చరణ్ - చిరు ఒకే సినిమాలో నటించడం అనేది కలగానే మిగలకుండా కొరటాల ఇలా తమ కలను సాకారం చేసారని మెగా ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్.