Advertisementt

అకీరా నందన్.. క్రేజ్ ఉంది చూశారూ..!

Thu 09th Apr 2020 04:07 PM
akira nandan,craze,birthday special,mega family,allu arjun  అకీరా నందన్.. క్రేజ్ ఉంది చూశారూ..!
Akira Nandan Craze Revealed on his Birthday అకీరా నందన్.. క్రేజ్ ఉంది చూశారూ..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ మీద పవన్ ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా అంచనాలు పెట్టేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో భీభత్సమైన క్రేజ్. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నెగ్గలేకపోయినా.. సినిమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికి కింగే. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాపై యమా క్రేజ్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ.. అకీరా పై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా అకీరా నందన్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న అకీరా కి విష్ చేసిన వారు బోలెడంత మంది. స్టార్ హీరో అల్లు అర్జున్, అకీరా పుట్టిన రోజు ఒకే రోజు కావడం మెగా ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీకి స్పెషల్ అయితే.. అల్లు అర్జున్ కి ఎంతగా ఫాలోయింగ్ ఉందో.. అకీరాకి దానికి కొద్దిగా ఫాలోయింగ్ తగ్గింది కానీ.. అకీరా క్రేజ్ మాత్రం మాములుగా లేదు. అకీరా నందన్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, బర్త్ డే కామన్ డిపి, అకీరా కి బర్త్ డే విషెస్ అబ్బో సోషల్ మీడియా అంతా మెగా హీరోల హడావిడే. నిన్న మొత్తంలో అల్లు అర్జున్ తర్వాత ట్రెండింగ్ లో ఉంది అకీరా పేరే. మరి అకీరా సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ.. అకీరా క్రేజ్ మాములుగా లేదు అంటున్నారు.

Akira Nandan Craze Revealed on his Birthday:

Birthday Special: Akira Nandan Trending in Top Place

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ