Advertisementt

ఆచార్య నుండి త్రిష తప్పుకోవడానికి కారణం అదే..?

Thu 09th Apr 2020 05:18 AM
megastar chiranjeevi,acharya,trisha,koratala shiva  ఆచార్య నుండి త్రిష తప్పుకోవడానికి కారణం అదే..?
reason behind Trisha lefft Acharya..? ఆచార్య నుండి త్రిష తప్పుకోవడానికి కారణం అదే..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యలో హీరోయిన్ గా మొదట త్రిషని తీసుకున్నారు. ఏమైందో తెలియదు గానీ త్రిష ఆచార్య నుండి తప్పుకుంటున్నట్లుగా స్టేట్ మెంట్ ఇచ్చింది. దర్శకుడితో ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే సినిమా నుండి తప్పుకున్నట్లు కారణాలు చూపింది. అయితే ఆ క్రియేటివ్ డిఫరెన్స్ ఏంటనేవి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయమై ఆచార్య టీమ్ ఎప్పుడూ స్పందించలేదు. 

త్రిష తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత కాజల్ మరోసారి చిరంజీవితో జోడీ కట్టింది. ఆ  పాత్రకి కాజల్ బాగానే డిమాండ్ చేసిందని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఆచార్య నుండి త్రిష ఎందుకు తప్పుకుందో తెలిసింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీలో త్రిషకి ఆఫర్ రావడం వల్లే ఆచార్య నుండి తప్పుకుందట. 

ఆ సినిమాకి ఎక్కువ డేట్లు అవసరం కావడంతో, ఆచార్య నుండి తప్పుకుని క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ అర్థం లేని కారణం చూపిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఏంటనేది వారికే తెలియాలి. కరోనా కారణంగా ఆచార్య చిత్ర షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

reason behind Trisha lefft Acharya..?:

Trisha left Acharya for the reason of

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ