Advertisementt

‘ఆచార్య’లో అతిథిగా వచ్చేస్తున్న నిహారిక!

Thu 09th Apr 2020 03:45 PM
niharika,guest role,chiranjeevi,acharya movie,koratala shiva,naga babu  ‘ఆచార్య’లో అతిథిగా వచ్చేస్తున్న నిహారిక!
Niharika Guest Role In Chiranjeevi Acharya Movie! ‘ఆచార్య’లో అతిథిగా వచ్చేస్తున్న నిహారిక!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. దాదాపు అందరూ సక్సెస్సే అయ్యారు. అయితే హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిహారిక మాత్రం అస్సలు సెట్ అవ్వలేకపోతోంది. ఇంతవరకూ ఈమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ పడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలకు మాత్రం అచ్చొచ్చిన టాలీవుడ్.. మెగా డాటర్స్‌కు అచ్చిరాలేదన్న మాట. దీంతో సినిమాల్లో నటించడం దాదాపు నిహారిక మానేసింది. ఆ తర్వాత ఏదో అప్పుడప్పుడు టీవీ షోలో.. వెబ్ సిరీస్‌లో.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తోంది.

అయితే.. ఆ మధ్య పెదనాన్న సినిమాలో నటించాలని ఉందని.. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో నటించింది. ఆ తర్వాత అయినా అవకాశాలు వస్తాయని అనుకున్నప్పటికీ ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా మరోసారి చిరు సినిమాలో మెగా డాటర్ చాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిహారిక ‘ఆచార్య’లో అతిథి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు సయోధ్యతో కొరటాల ఈ పాత్ర ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆచార్య మూవీకి సంబంధించి లెక్కలేనని.. పుకార్లు షికార్లు చేశాయి... ఇంకా చేస్తున్నాయ్ కూడా. మరి ఆ పుకార్ల విషయంలో ఇంతవరకూ సినిమా యూనిట్ అస్సలు స్పందించనేలేదు. మరి నిహారిక పాత్ర విషయం ఏ మేరకు నిజమో దీనిపై అయినా క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Niharika Guest Role In Chiranjeevi Acharya Movie!:

Niharika Guest Role In Chiranjeevi Acharya Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ