విలక్షణ నటుడిగా పేరుగాంచిన ఉపేంద్ర గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు, కన్నడలో పలు చిత్రాల్లో నటించి రియల్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంతమంది హీరోలు వచ్చినా ఈయన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. వీలైతే హీరోగా నటించడం లేకుంటే విలన్‌గా నటించడం.. ఏదైనా సరే సినిమాల్లోనే ఉండిపోతాడు. ఆ మధ్య రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ సొంత పార్టీ వాళ్లే ఝలక్ ఇవ్వడంతో అది కాస్త చుట్టేసి ఇంట్లో పెట్టేశాడు. ఆ తర్వాత సినిమాలపైనే దృష్టిసారించాడు.
అటు.. కన్నడ సినిమాల్లో.. అవకాశం వచ్చినప్పుడు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పిస్తుంటాడు. ఇప్పటికే బన్నీ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో విలన్‌గా నటించిన ఆయనకు మరోసారి తెలుగులో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో సినిమా. వంశీ పైడిపల్లిని పక్కనెట్టేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. పరుశురామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆయన పాత్రధారులను వెతికే పనిలో ఉన్నాడట.
ఇప్పటికే.. ఫలానా హీరోయిన్‌ను తీసుకున్నాడట అని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేయగా తాజాగా ఇదిగో విలన్ అని.. ఇతనే మహేశ్‌ను ఢీకొట్టబోయేదని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఉపేంద్రను విలన్‌గా పరుశురామ్ తీసుకున్నాడన్నదే ఆ టాక్ సారాంశం. ఇప్పటికే సంప్రదింపులు కూడా అయ్యాయట. సూపర్ స్టార్ సినిమా కావడం.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించే అవకాశం రావడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఉపేంద్ర నో చెప్పాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమే అన్న మాట. మరి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో ఏంటో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.