క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ణవంశీ మరాఠీ సినిమా నటసామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రధారులుగా పోషిస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో పాత్ర గురించి ఇటీవలే బయటకి వచ్చింది. టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో నటిస్తున్నాడట.
బ్రహ్మానందం సినిమాల్లో కనిపించక చాలా రోజులు అయిపోయింది. వర్మ దర్శకత్వం వహించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో కనిపించినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అసలు నటించినట్టు కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే నార్మల్ గా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే కావాల్సినంత నవ్వుకోవచ్చని అనుకుంటారు. కానీ దానికి వ్యతిరేకంగా బ్రహ్మానందం ఈ సారి ఏడిపిస్తాడట.
రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం పాత్ర మధ్యలోనే చనిపోతుందట. ఆ టైమ్ లో బ్రహ్మానందం నటన ప్రతీ ఒక్కరికీ కన్నీళ్ళు పెట్టిస్తుందని అంటున్నారు. అయితే బ్రహ్మానందం ఉన్నాడని సినిమాకి నవ్వుకోవడానికి వచ్చిన వారు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో..!