రియలిస్టిక్ చిత్రం ‘పలాస 1978’కు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి స్పందన
ఈమద్య కాలంలో కొత్తవారు సరికొత్త కాన్సెప్ట్‌లతో చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమాపై కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
యదార్థ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జత చేసి తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు కొత్తవారు నటించారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మరింతమంది ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్స్‌లో మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు అమెజాన్‌లో ఈ సినిమాను వీక్షించి ఫేస్ బుక్, ట్విట్టర్‌లో పలాస సినిమా గురించి తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు.
రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పించారు.