సీసీసీకి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత్రి పద్మావతి గల్లా
అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తోన్న పద్మావతి గల్లా బుధవారం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నిత్యావసరాలను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ఎంతోమంది సినీ పెద్దలు ముందుకు రావడం శుభ పరిణామమనీ, ఆ మంచి పనిలో భాగం కావాలనే ఉద్దేశంతో సీసీసీకి తమ వంతుగా రూ. 10 లక్షలు అందజేస్తున్నామనీ పద్మావతి తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో అందరూ సమష్టిగా కృషి చేయాలనీ, తమ తమ ఇళ్లల్లో ఉండటం ద్వారా క్షేమంగా ఉండాలనీ ఆమె కోరారు. అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ తాము నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిందనీ, పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ కొనసాగిస్తామనీ ఆమె చెప్పారు.
ఎఫ్.ఎన్.సి.సి. రూ.25 లక్షల విరాళం
కరోనా బాధితుల సహాయార్తం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సిసి) తరఫున ప్రెసిడెంట్ ఆదిశేషగిరి రావు, సెక్రటరీ కె.ఎస్.రామారావు మరియు ఎఫ్.ఎన్.సి.సి ఫౌండర్ మెంబర్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహన్ రావు సంయుక్తంగా హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో మంత్రి కె.టి.ఆర్ ను కలిసి రూ.25లక్షల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి అందించారు.
సిసిసి కి హీరో సాయికుమార్ 500004 రూపాయలు విరాళం డబ్బింగ్ యూనియన్ కు మరో రెండు లక్షల ఎనిమిది రూపాయలు విరాళం
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు హీరో సాయికుమార్ మరియు తనయుడు హీరో ఆది కలిసి ఐదు లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళంగా ఆర్‌టిజిఎస్ ద్వారా బుధవారం ఉదయం సీసీసీకి పంపించారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయికుమార్ తనవంతుగా ఒక లక్ష ఎనిమిది రూపాయలు, సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.
పుట్టినరోజున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన చిన శ్రీశైలం యాదవ్
ప్రజా, సినీ కార్మిక నాయకులు చిన శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్.ఎల్.ఏ అభ్యర్థి నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, కాదంబరి కిరణ్‌లు పాల్గొని పేదలకు ఆహారంతో పాటు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు హీరో సాగర్ రూ. 5 లక్షల విరాళం
కరోనా మహమ్మారి నివారణార్ధం హీరో సాగర్ (మొగలిరేకులు ఫేమ్ ఆర్ .కె నాయుడు)సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షలు సహాయాన్ని నేడుతెలంగాణ మంత్రి వర్యులు కె టి ఆర్ కు అందజేశారు