Advertisementt

ఇంట్రెస్టింగ్: ‘ఎఫ్-3’లో లాక్‌డౌన్ బ్యాక్ డ్రాప్!?

Wed 08th Apr 2020 11:20 AM
india lockdown,lockdown backdrop,anil raavipudi,f3 movie  ఇంట్రెస్టింగ్: ‘ఎఫ్-3’లో లాక్‌డౌన్ బ్యాక్ డ్రాప్!?
Lockdown Backdrop In Anil Raavipudi F3 movie! ఇంట్రెస్టింగ్: ‘ఎఫ్-3’లో లాక్‌డౌన్ బ్యాక్ డ్రాప్!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో హిట్ చిత్రాల దర్శకుల్లో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్న అనిల్ రావిపూడి ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ‘ఎఫ్-3’ కావడంతో వెంకీ, వరుణ్‌తో పాటు మరో హీరో తప్పనిసరి. ఆ హీరోగా ఎవర్ని తీసుకోవాలి..? అని ఆలోచనలో పడ్డాడట అనిల్. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ పూర్తయ్యే లోపు ఆ మూడో హీరోను పట్టేయాలని అనిల్ అనుకున్నప్పటికీ వర్కవుట్ అవ్వట్లేదట. ఒకరిద్దర్ని ఫోన్‌లో సంప్రదించగా.. నో చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. అదేమిటంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇంట్లో ఉన్నారు గనుక.. భార్య భర్తల మధ్య గొడవలు ఎలా ఉంటాయ్..? వారి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయ్..? పిల్లలతో ఎలా గడుపుతున్నారు..? మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భార్య బాధితుల గురించి వీడియోలు, భర్త వంట చేస్తన్నట్లున్న వీడియోలు ఇలాంటివి కూడా తన ‘ఎఫ్-3’లో ఓ పార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడట. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది గనుక దీన్ని క్యాష్ చేసుకుంటే బాగుంటుందని తన తోటి అసిస్టెంట్స్ చెప్పడంతో అనిల్ కథలో రాసుకుంటున్నాడట. మొత్తానికి చూస్తే లాక్‌డౌన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందన్న మాట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Lockdown Backdrop In Anil Raavipudi F3 movie!:

Lockdown Backdrop In Anil Raavipudi F3 movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ