Advertisementt

విజయశాంతికి దండం పెడుతున్న నిర్మాతలు!

Wed 08th Apr 2020 09:29 AM
producers,vijayasanthi,remunaration,ramulamma,tollywood  విజయశాంతికి దండం పెడుతున్న నిర్మాతలు!
Producers Fear About Vijayasanthi Remunaration! విజయశాంతికి దండం పెడుతున్న నిర్మాతలు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ను ఒకప్పుడు ఏలేసిన సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ..‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాతికేళ్ల క్రితం.. ఇప్పుడూ తనలోని పవర్ అలానే ఉందని నిరూపించుకుంది. సరిలేరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా, కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమె నటనకు ఫిదా అయిన దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో నటించండి మేడమ్ అని సంప్రదిస్తున్నారట. ఆ మధ్య తాను ఇక సినిమాల్లో నటించనని సోషల్ మీడియాలో చెప్పి అభిమానులు, సినీ ప్రియులను షాక్ గురి చేసింది రాములక్క. అయినప్పటికీ కొందరు నిర్మాతలు మాత్రం కచ్చితంగా తాము నిర్మిస్తున్న సినిమాలో నటించాలని గట్టిగా పట్టుబడుతున్నారట.

తాజాగా.. ఓ ముఖ్యపాత్రలో విజయశాంతి అయితేనే సెట్ అవుతుందనుకుని దర్శకుడు, నిర్మాత ఇద్దరూ సంప్రదించారట. అయితే.. ఆమె చెప్పిన పారితోషికంకు సదరు నిర్మాతలు కంగుతిన్నారట. వామ్మో ఈమేంటి.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా పారితోషికం డిమాండ్ చేస్తోంది..? అని షాకవుతున్నారట. రీ ఎంట్రీ కాబట్టి సరిలేరుకు గట్టిగా డిమాండ్ చేసి ఉండొచ్చు.. మరీ ఇప్పుడు కూడా అదే పంథా అయితే కష్టమని నిర్మాతలు చెప్పినప్పటికీ ఆమె అస్సలు తగ్గట్లేదట. దీంతో చేసేదేమీ లేక మీకో దండం మేడం అంటూ దండమెట్టేస్తున్నారట నిర్మాతలు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకరిద్దరు నిర్మాతలు ఎదుర్కొన్న అనుభవం ఇదట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే రాములక్క రియాక్ట్ అవ్వక తప్పదేమో.

Producers Fear About Vijayasanthi Remunaration!:

Producers Fear About Vijayasanthi Remunaration!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ