క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకుని అన్నచాటు తమ్ముడిలా ఎదగాలని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సినిమా కథ పరంగా మంచి మార్కులు పడినప్పటికీ పెద్దగా ఆడలేదు. అయితే.. ఆనంద్ నటనకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత బ్రదర్ ఆఫ్ విజయ్ కనిపించకపోవడంతో ఆయన పనైపోయిందని.. ఇక కష్టమనేనని వార్తలు వినిపించాయి. అయితే రోండో సినిమా పట్టాలెక్కడంతో ఆనంద్‌ను అందరూ మరోసారి గుర్తు చేసుకున్నారు.
కాగా.. కరోనా లాక్‌డౌన్ రెండో సినిమా సెట్స్‌పైనే ఉండిపోయింది. ఈ గ్యాప్‌లో మరో కొత్త డైరెక్టర్ కథ చెప్పాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు దామోదర అట్టాడ అని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితమే కథ వినిపించడంతో.. కొత్తగా ఉండటం, అంతకుమించి ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆనంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే పాత్ర ఈ ఛాలెంజింగ్‌గా ఉండటంతో తెగ ఆనంద పడిపోయాడట. ఈ పాత్ర తన కెరియర్‌లో ఎదిగేందుకు చాలా హెల్ప్ అవుతుందని కుర్రహీరో నమ్మకంతో ఉన్నాడట.
అయితే.. ఈ సినిమాకు విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కథానాయికతో పాటు ఇతర నటీనటులతో పాటు పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారట. మొత్తానికి చూస్తే ఇప్పుడు రెండు సినిమాలు ఆనంద్ చేతిలో ఉన్నాయన్న మాట. ఒక గట్టి హిట్ పడితే అన్నంత కాకపోయినా కాస్తో కూస్తో పేరు మార్మోగుతుందని కుర్రాడు అనుకుంటున్నాడు. మరి ఆ పేరు ఎప్పుడు వస్తుందో..? ఆ రేంజ్ సినిమా ఎప్పుడు ఈ కుర్రాడికి తగులుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ.