కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ పరిశుభ్రతపై ప్రతీ ఒక్కరికీ ఆసక్తి ఏర్పడింది. చేతులు కడుకున్ని వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వైరస్ బారినుండి కాపాడుకోవచ్చనే సందేశాలు వినవస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు సినిమా సెలెబ్రిటీల వరకు మందులేని కరోనా వైరస్ నుండి ప్రాణాలని రక్షించుకోవడానికి సామాజిక దూరంతో పాటు శుభ్రత కూడా అవసరమని చెవులు హోరెత్తిపోయేలా చెబుతూనే ఉన్నారు.
తాజాగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కోవిడ్ 19 రాకుండా జాగ్రత్తలు చెబుతున్నాడు. మనదేశంలో కరోనా నుండి కాపాడుకోవడానికి లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వాలు సైతం చెబుతున్న తరుణంలో మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కులు వాడాలని...అయితే మెడికల్ మాస్కులని డాక్టర్లకి వదిలేద్దామని.. మనం నోటిని, ముక్కుని అడ్డుపెట్టుకోవడానికి క్లాత్ మాస్క్ లని ఉపయోగిస్తే చాలనీ.. ఇంకా అనుకుంటే అమ్మా చున్నీ అయినా సరిపోతుందని చెప్పాడు.
మొత్తానికి కరోనా విజృంభిస్తున్న వేళ ప్రాణాలకి తెగించి దాన్ని తరిమికొట్టడానికి చేస్తున్న యుద్ధంలో డాక్టర్లకి కావాల్సిన వైద్య సదుపాయాలని ఇవ్వాలని చెప్పకనే చెప్పాడు.