Advertisementt

రష్మికని ఏడిపించిన అభిమాని..!

Tue 07th Apr 2020 12:43 PM
rashmika mandanna,geetha govindam,mahesh babu,  రష్మికని ఏడిపించిన అభిమాని..!
Fan moment for Rasmika.. రష్మికని ఏడిపించిన అభిమాని..!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాల్లో పెద్ద సినిమా హీరోలకి ఏకైక ఛాయిస్ గా మారిన రష్మిక వరుస హిట్లతో దూసుకెళ్తుంది. నాగశౌర్య సరసన నటించిన ఛలో సినిమాతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో విజయం అందుకుని.. ఏకంగా సూపర్ స్టార్ సరసన సరిలేరు నీకెవ్వరులో అవకాశం కొట్టేసి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది. మొన్నటికి మొన్న భీష్మ సినిమాతో మరో హిట్ కొట్టేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రివేంజ్ డ్రామాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది.

అయితే నేడు రష్మిక మందన్న తన పుట్టినరోజుని జరుపుకుంది. సాధారణంగా హీరోయిన్ల పుట్టినరోజు దినోత్సవాన్ని ఆమె అభిమానులు జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. రష్మిక మందన్న అభిమాని కూడా అలానే చేసాడట. రష్మిక పుట్టినరోజని చెప్పి దేవుడికి పాలాభిషేకం చేయించాడట. మరో అభిమాని రష్మిక నటించిన అన్ని సినిమాల్లో నుండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ ని తీసుకుని ఒక వీడియోని తయారు చేశాడట. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న రష్మిక అభిమానులు చూపిస్తున్న ప్రేమకి ఆనందంతో కళ్లనీళ్ళు పెట్టుకుంది. 

హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్న తనకి ఇంత ప్రేమ చూపించడంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఎమోషనల్ అయింది.

Fan moment for Rasmika..:

Fan moment for Rashmika on her birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ