Advertisementt

5.5 ల‌క్ష‌ల విరాళం ప్రకటించిన రామ్ తాళ్లూరి

Tue 07th Apr 2020 06:41 PM
ram talluri,film producer,entrepreneur,corona outbreak,donation  5.5 ల‌క్ష‌ల విరాళం ప్రకటించిన రామ్ తాళ్లూరి
Film Producer and Entrepreneur Ram talluri donates 5.5 lakhs to prevent corona outbreak 5.5 ల‌క్ష‌ల విరాళం ప్రకటించిన రామ్ తాళ్లూరి
Advertisement
Ads by CJ

క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌ముఖ నిర్మాత, పారిశ్రామిక‌వేత్త రామ్ తాళ్లూరి 5.5 ల‌క్ష‌ల విరాళం

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు త‌మ వంతు స‌హాయార్ధం ప‌లువురు పారిశ్రామికవేత్త‌లు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్ర‌ముఖులు భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ నిర్మాత‌, పారిశ్రామిక‌వేత్త రామ్ తాళ్లూరి కూడా ముందుకొచ్చారు. 5.5 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 5 ల‌క్ష‌ల రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి మ‌రో యాభై వేలు విలువ చేసే నిత్య అవ‌స‌రాల స‌రుకులు సినీ కార్మీకుల‌కు అందించారు. తాను అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధ‌లు త‌రుపున రామ్ తాళ్లూరి ఈ విరాళం అందించ‌డం జ‌రిగింది. గ‌త నెల‌లో త‌న కంపెనీ ప‌ని మీద అమెరికా వెళ్లిన రామ్ తాళ్లూరి లాక్ డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే నిలిచిపోయారు.

Film Producer and Entrepreneur Ram talluri donates 5.5 lakhs to prevent corona outbreak:

Ram talluri Announced 5.5 lakhs to prevent corona outbreak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ