గత కొన్ని రోజులుగా చిరు ఆచార్య సినిమాలో మహేష్ నటించబోతున్నాడని, రామ్ చరణ్ తో స్నేహం, చిరు మీద గౌరవం, కొరటాలతో మీదున్న అభిమానంతో చిరు ఆచార్య లో మహేష్ బాబు ఓ అతిధి పాత్ర చేయబోతున్నాడని, మహేష్ స్టార్ హీరో కాబట్టి ఆ రోల్ పరిధి పెంచారని, ఓ 30 నిమిషాల పాటు మహేష్ ఆచార్య లో కనిపించబోతున్నాడని, ఇక 30 నిమిషాల కోసం మహేష్ 30 కోట్లు పారితోషకం అడిగాడని, మహేష్ కి 30 కోట్లు ఇచ్చేబదులు రామ్ చరణ్ నే ఆచార్య లోకి తీసుకోబోతున్నారని అబ్బో చాలానే న్యూస్ లు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి.
అయితే తాజాగా చిరు మాత్రం మహేష్ ఆచార్యలో నటిస్తున్నాడని వార్త ఎలా పుట్టిందో తనకి తెలియదని, అసలు మహేష్ ని ఆచార్య కోసం అనుకోలేదని, మొదటి నుండి ఆ పాత్రకి రామ్ చరణ్ నే అనుకున్నామని, రామ్ చరణ్ తో కలిసి నేను నటిస్తే చూడాలనేది నా భార్య సురేఖ కోరిక అని.. అందుకే ఆచార్యలో నేను చరణ్ కలిసి నటించబోతున్నామని చిరు తెలిపాడు. అయితే RRR సినిమాతో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కోసం రాజమౌళి తో చర్చించి.. డెసిషన్ తీసుకుందామని అనుకున్నామని, అయితే మహేష్ అంటే చాలా ఇష్టమని, కానీ మహేష్ మాత్రం మా ఆచార్యలో చెయ్యడం లేదని, చరణ్ తో కలిసి నేను పూర్తి స్థాయి చిత్రం చేస్తే చూడాలనేది నాభార్య కోరిక అంటూ చిరు తన ఆచార్యలో మహేష్ ని అసలు అనుకోలేదనే నిజాన్ని బయటపెట్టాడు.