బాలీవుడ్ భామలు టాలీవుడ్ హీరోల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడూ బాలీవుడ్ భామలకు ఆనని సౌత్ హీరోలు ఈమధ్యన కాస్త స్పెషల్ గా కనబడుతున్నారు. టాలీవుడ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని అలియా భట్ దగ్గరనుండి... జాన్వీ కపూర్ వరకు పబ్లిక్ ఇంటర్వూస్ లోనే చెబుతున్నారు. విజయ్ దేవరకొండ స్టయిల్ కి అలియా భట్ ఎప్పుడో ఫిదా.. విజయ్ దేవరకొండ స్టయిల్ కి పడిపోయా అంది. మరి తెలుగులో రామ్ చరణ్ సరసన RRR లో నటిస్తున్న అలియా భట్ ఇప్పుడు మరో సౌత్ హీరో అంటే చాలా ఇష్టమని చెబుతుంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ కి సౌత్ హీరో ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, బాహుబలి లో ప్రభాస్ నటన చాలా బావుంటుంది అని, బాహుబలి లో ప్రభాస్ నటనతో పాటుగా ఆయన తెరపై కనిపించే తీరు చాలా అద్భుతమని, బాహుబలి లో ప్రభాస్ ని చూసాక నేను ఆయనకి పిచ్చ ఫ్యాన్ అయ్యిపోయా అంటూ తెగ ఎగ్జైటింగ్ గా చెబుతుంది. మరి బాహుబలి తర్వాత ప్రభాస్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. బాహుబలి తర్వాత ప్రభాస్ అందరికి ఇష్టమైన హీరోగా మారిపోయాడు. మరి అలియాకే కాదు.. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ కి ప్రభాస్ బాహుబలి తర్వాత ఫేవరెట్ గా మారిపోయాడు.