కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తుంటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో బతికేస్తున్నారు. అయితే అదేదో సామెత ఉంది కదా.. అలా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాత్రం కరోనాను కూడా తెగ వాడేసుకుంటున్నాడు. అంతేకాదు ట్విట్టరెక్కి గోలగోల చేసేస్తున్నాడు. వాస్తవానికి బండ్లకు సినిమాలే కాకుండా ‘పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్’ కూడా నడుపుతున్నాడు. మొన్నటి వరకూ చికెన్ రేటు తగ్గిందని తెగ బాధపడిపోయాడు. అయితే చికెన్ వల్ల కరోనా రాదని.. దాని వల్ల రోగనిరోధక శక్తి వస్తుందని సాక్ష్యాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటిచడంతో బ్లేడ్ గణేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. తాజాగా.. మరోసారి ఆయన బాధపడుతున్నాడు. ఈసారెందుకంటే.. గుడ్ల రేట్లు కొండెక్కడంతో ఈయన హడావుడిగా ట్విట్టరెక్కి వరుస ట్వీట్స్‌తో తెగ గోల చేసేశాడు. ఇంతకీ ఆయన బాధేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఇదీ బండ్ల బాధ..!?
‘కొండెక్కిన కోడిగుడ్డు’ (పేపర్ క్లిప్‌ను జతచేస్తూ) ధర అని ఈరోజు ప్రముఖ దిన పత్రికలో చదివాను. కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని రైతు అంటారు. కోట్ల నష్టాల్లో లేయర్ కోడి రైతు గుడ్డు పెట్టి ఇచ్చే పత్తి కోడి రైతు కష్టాల్లోనే ఉన్నారు. ఈరోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది. మాకు మాత్రం రెండు రూపాయల 80 పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంది మా నష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించండి’ అని బండ్ల గణేష్ రెక్వెస్ట్ చేశాడు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో విఫలం అయ్యిందని చెప్పడంలో భాగంగా ఇలా ట్విట్టర్‌లో రాసుకొచ్చాడన్న మాట.
అసలెందుకిలా..!
బండ్ల ట్వీట్స్‌లో కాస్త నిజాయితీ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలా అస్తమానూ ట్విట్టరెక్కి హడావుడి చేస్తుండటంతో నెటిజన్లు, ఫాలోవర్స్ ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ‘కరోనా చస్తుంటే నీ గోలేంటి..’ అప్పుడేమో చికెన్ పడిపోయిందంటావ్.. ఇప్పుడేమో కోడిగుడ్డు కొండెక్కిందంటావ్.. ? ఇంతకీ నీ బాధేంటి..? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకొదరైతే అన్నీ సరే కరోనా నేపథ్యంలో ఏమైనా సాయం చేశావా లేదా సామీ ఇంతకీ మా తలకాయలు తింటున్నావ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేసేస్తున్నారు. వీటికి బండ్ల ఎలా రియాక్ట్ అవుతాడో మరి.