అందాల తార సాయిపల్లవి గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మొదలు చాలా సినిమాల్లో నటించేసి మెప్పించింది. అలా తెలుగు రాష్ట్రాల యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నాటి నుంచి నేటి వరకూ ఈ హైబ్రీడ్ పిల్లకు అవకాశాలకు కొదువే లేకుండా పోతోంది. అంతేకాదండోయ్ టైమ్ లేక సినిమాల్లో నటించలేకుందంటే ఏ రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయో అర్థం చేస్కోండి.
సినిమాలు మానేస్తానని చెప్పి..
ప్రస్తుతం సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు బంద్ ఉండటంతో ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా తనకు వ్యక్తిగత విషయాలు.. నటి కాకుంటే ఏమయ్యేది..? జీవితంలో ఎక్కువగా ఏడిపించిన ఘటనలు..? ఎవరికి తెలియని విషయం..? ఇలా చాలా విషయాలనే ఆమె ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది. ‘నేను ఒక వేళ నటి కాకుంటే ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్ని. మాది తమిళనాడులోని ‘బడుగ’ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు. ఎన్జీకే (సూర్య సినిమా) సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్ చేస్తుండేవారు.. ఆ టైమ్‌లో సినిమాలే వదిలేస్తానని మా అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను’ అని తన అనుభవాలను సాయిపల్లవి పంచుకుంది. కాగా.. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో, ‘విరాట పర్వం’ అనే సినిమాల్లో నటిస్తోంది.