ప్రముఖ ఐటీ వ్యాపారవేత్త, నిర్మాత రామ్ తాళ్లూరికి అరుదైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత కేథలిన్ ట్రేసీ రచించిన ‘21వ శతాబ్దపు అద్భుత ఆవిష్కర్తలు’ అనే పుస్తకంలో రామ్ తాళ్లూరి విజయప్రస్థానానం ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. మొత్తం 15 మంది ఆవిష్కర్తల గురించి ఈ పుస్తకంలో నిశితంగా వివరించగా.. అందులో రామ్ తాళ్లూరి ఒకరు విశేషం. రామ్.. ‘లీడ్ ఐటీ’ అనే సంస్థతో ఆకాశమంత అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. ఆయన విజయప్రస్థానాన్ని ఆ పుస్తక రూపంలో వచ్చింది. కాగా ఒక్క వ్యాపారవేత్తగానే కాదు.. టాలీవుడ్‌లో మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు ‘నేల టికెట్’, ‘డిస్కో రాజా’లకు నిర్మాతగా వ్యవహరించారు. అలా టాలీవుడ్‌తో కూడా మంచి పరిచయాలున్నాయి. ఈ క్రమంలో రామ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
పవన్ ట్వీట్.. రిప్లయ్ కూడా
రామ్‌కు దక్కిన ఈ గౌరవంపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘రామ్ తాళ్లూరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వ్యాపార దక్షతతోనే కాకుండా, సామాజిక స్ఫూర్తి పరంగానూ తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరి.. ప్రభుత్వ ఉద్యోగిగా.. తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు’ అని ఆయన సేవలను కొనియాడారు. ఇందుకు రామ్ తాళ్లూరి కూడా స్పందించారు. ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు దక్కిన అపురూప గౌరవంగా భావిస్తాను’ అని రిప్లయ్ ఇచ్చారు.
మంచి సన్నిహితులు..
కాగా.. పవన్‌కు రామ్ తాళ్లూరికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. అదే చనువుతోనే రామ్ పిలుపు మేరకు పవన్ ఆడియో ఫంక్షన్‌కు ఆయన వెళ్లారు. ఆ తర్వాత జనసేన పార్టీకి సేవలందిస్తానని కూడా చెప్పడం.. పవన్ కోసం తాను ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒకట్రెండు సార్లు ప్రకటనలు కూడా తాళ్లూరి చేశారు. అలా వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అందుకు తన ఆప్తుడి పేరు మార్మోగడంతో పవన్ తాజాగా ప్రశంసల జల్లు కురిపించారు.