Advertisementt

మరో బాలీవుడ్ భామకి కరోనా పాజిటివ్..

Mon 06th Apr 2020 01:03 PM
coronavirus,covid 19,bollywood,shaja morani  మరో బాలీవుడ్ భామకి కరోనా పాజిటివ్..
Bollywood celebrity tests corona possitive మరో బాలీవుడ్ భామకి కరోనా పాజిటివ్..
Advertisement
Ads by CJ

కరోనాని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే అంతకంతకు పెరుగుతూనే ఉంది. చైనాలో మొదలై ప్రపంచమంతా విస్తరించి అన్ని దేశాలని తీవ్ర అవస్థలకి గురి చేస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికానే గడగడలాడిస్తున్న ఈ వైరస్ వారు వీరు అనే తేడా లేకుండా ఎవరికి పడితే వారికి వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న కనికా కపూర్ కరోనా బారిన పడి తీవ్ర పోరాటం చేసి నిన్ననే నెగెటివ్ గా రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకుంది.

ఆమె బ్రతికి బట్టకట్టిందనే వార్త వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు మరో బాలీవుడ్ సెలెబ్రిటీకి కరోనా పాజిటివ్ అని తేలింది. షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ నిర్మాత కరీం మొరాని కుమార్తె షాజా మొరానీకి కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆస్ట్రేలియా నుమ్డి ముంబైకి వచ్చిన ఆమెకి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు ఛేయగా పాజిటివ్ అని తేలింది. 

అయితే ఆమెకి వైరస్ సోకిందని తెలియగానే ఆమెతో పాటు ఆస్ట్రేలియా నుండి వచ్చిన బోయ్ ఫ్రెండ్ ప్రియాంక్ శర్మకి క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు. కనికా రికవరీ అయ్యిందని సంతోషించే లోగానే ఇలా మరొకరికి వైరస్ సోకడంతో బాలీవుడ్ జనాల్లో భయం పట్టుకుంది.

Bollywood celebrity tests corona possitive:

Bollywood star producers daughter tests corona possitive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ