ఒక పాట హిట్ కావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ పాట తాలూకు సందర్భం, ఆ సినిమా హీరో, మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత , సినిమా దర్శకుడు ఇలా ప్రతీ ఒక్కరి కృషి ఉంటుంది. అయితే ఎక్కువ పాటలు సినిమా హీరో కారణంగానే హిట్ అవుతుంటాయి. అవును.. స్టార్ హీరో ఉన్న సినిమాల్లోని పాటలకి ఎక్కువ రీచ్ ఉంటుంది. చాలా పాటలు ఎంత బాగున్నా కూడా స్టార్ హీరో లేని కారణంగా కావాల్సినంత గుర్తింపు రాకుండా ఉండిపోయాయి.
అయితే ఈ మధ్య వచ్చిన ఒకానొక పాట మాత్రం యూట్యూబ్ లో సంచలనాలని క్రియేట్ చేస్తుంది. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతోన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుండి నీలి నీలి ఆకాశం అన్న పాట ఇప్పటి వరకు దాదాపు ఎనభై మిలియన్ల వ్యూస్ ని తెచ్చుకుంది. ఈ పాట ద్వారానే ఈ సినిమాకి గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతానికి చంద్రబోస్ సమకూర్చిన సాహిత్యం సరిగ్గా జతకూడి ఆ పాటని సూపర్ డూపర్ హిట్ గా నిలిపింది. అయితే ఈ పాటకి అంత గుర్తింపు రావడానికి కారణం ఎవరా అని ఆలోచిస్తే రాసిన చంద్రబోస్ కే ఎక్కువ క్రెడిట్ వెళ్తుందని చెబుతున్నారు. అనూప్ సంగీతం సూపర్బ్ గా ఉన్నప్పటికీ సాహిత్యం ద్వారా ఆ పాట స్థాయి మరింత పెరిగిందని టాక్..