Advertisementt

విజయ్ దేవరకొండకు కొత్త కష్టాలు!

Mon 06th Apr 2020 05:28 PM
vijay deverakonda,faces,fitness,corona effect,movies,puri jagannadh  విజయ్ దేవరకొండకు కొత్త కష్టాలు!
Corona Effect : New Problems to Vijay Deverakonda విజయ్ దేవరకొండకు కొత్త కష్టాలు!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమయ్యాడు. అయితే కరోనాకి విరాళం ఇవ్వలేదని విజయ్ దేవరకొండ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అప్పుడప్పుడు వీడియోస్ తో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నాడు. అయితే పూరి సినిమా బ్రేక్ తీసుకున్న విజయ్ దేవరకొండ చాలా గప్ చుప్ గా ఉంటున్నాడు కానీ.. కరోనాపై స్పందించిందిలేదు. ఇక పూరి సినిమా కోసం కండలు పెంచి బాక్సర్ గా మారిన విజయ్ దేవరకొండకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిందట.

అదేమిటంటే... పూరి సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేసిన విజయ్ దేవరకొండకి కరోనా దెబ్బ మాములుగా పడలేదు. పూరి సినిమా కోసం చాలా రోజులపాటు విజయ్ దేవరకొండ కండలు తిరిగిన బాడీలో కనిపించాలి. కాబట్టి ఆ సిక్స్ ప్యాక్ బాడీని షూటింగ్ లేకపోయినా మెయింటింగ్ చెయ్యాల్సిందే. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తుంది. దానితో జిమ్ లు వగైరా మూతబడ్డాయి. కొంతమంది హీరోలు జిమ్స్ ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవడంతో.. వారు ఖాళీగా ఉన్న ఈ కరోనా సమయాన్ని చాలా టైం జిమ్ లోనే గడిపేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన కొత్తింట్లో ఇంకా జిమ్ ఏర్పాటు చేసుకోకపోవడం, బయట జిమ్స్ మూతబడడంతో.. సిక్స్ ప్యాక్ బాడీని మెయింటింగ్ చేసేందుకు కష్టపడుతున్నాడట. విజయ్ దేవరకొండ వర్కౌట్స్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. ఇక విజయ్ ఫిట్ నెస్ విషయంలో తేడా వస్తే.. పూరి సినిమా షూటింగు వాయిదా పడే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

Corona Effect : New Problems to Vijay Deverakonda :

Vijay Deverakonda Faces Fitness Problems 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ