Advertisementt

నో కన్ఫూజన్ ఆ హీరోతోనే అజయ్ భూపతి మూవీ!

Mon 06th Apr 2020 04:57 PM
no confusion,ajay bhupathy,sharwanand,anil sunkara,rx-100 movie director  నో కన్ఫూజన్ ఆ హీరోతోనే అజయ్ భూపతి మూవీ!
No Confusion On Ajay Bhupathy Next Movie! నో కన్ఫూజన్ ఆ హీరోతోనే అజయ్ భూపతి మూవీ!
Advertisement
Ads by CJ

‘ఆర్ఎక్స్ 100’ లాంటి బుల్లెట్ సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి.. టాలీవుడ్‌లో సింగిల్ సినిమాతో తన సత్తా చాటి చూపించిన దర్శకుడు అజయ్ భూపతి. ఫస్ట్ సినిమాతో రికార్డ్ సృష్టించిన అజయ్.. తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు..? ఏ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారు..? అసలు ఆయన సినిమాలో హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? ఈ సినిమాకు ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..? అనేవి గత కొన్ని రోజులుగా వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అయితే అత్యుత్సాహంతో కొన్ని వెబ్‌సైట్లు ఏవేవో రాసేస్తున్నాయి. 

మొన్నటి వరకూ కన్ఫూజన్

మాస్ మహారాజ్ రిజెక్ట్ చేయడం.. ఆ తర్వాత నాగ చైతన్య కోసం వెయిటింగ్.. శర్వానంద్ ఇలా చాలా మంది దగ్గరికెళ్లి కథ వినిపించడం వెనక్కి తిరగడమే సరిపోయింది. అప్పట్లో ఇలా వరుస కథనాలు రావడంతో స్పందించి అవన్నీ పుకార్లేనని చెప్పిన అజయ్.. ఆ తర్వాత మిన్నకుండిపోయాడు. శర్వానందే ఫైనల్ అనుకున్నప్పటికీ ఈ మధ్య ఆయన సినిమాలన్నీ ఆశించినంతగా ఆడకపోవడంతో ఇలాంటి తరుణంలో ప్రయోగాలు చేసి ప్రయోజనం లేదని.. సారీ అజయ్ అని సింపుల్‌గా చెప్పేశాడని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లేనట.

సందేహాలు అక్కర్లేదు..

శర్వానే హీరోగా సినిమా పక్కాగా వస్తుందట. అంతేకాదు.. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తాడని ఫుల్ క్లారిటీ వచ్చేసిందట. కరోనా ప్రభావం తగ్గి మళ్లీ సినీ కార్యకలాపాలు మొదలవ్వగానే ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కచ్చితంగా సినిమా చేద్దామని అజయ్‌కు శర్వా, అనిల్ సుంకర క్లారిటీగా చెప్పేశారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కరోనా వ్యవహారం ముగిసేలోపే అధికారిక ప్రకటన కూడా చేయాలని నిర్మాత భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.

No Confusion On Ajay Bhupathy Next Movie!:

No Confusion On Ajay Bhupathy Next Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ