టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్ రావిపూడికి అంటే.. ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. మరీ ముఖ్యంగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుల్లో ఒకరుగా పేరు కూడా ఉంది. ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత అనిల్ కన్ను.. స్టార్ హీరోలపైనే పడింది. అలా వినూత్న కథలతో దూసుకెళ్తున్న అనిల్ గాలి ఒక్కసారిగా తీసేశాడు తరుచూ వార్తల్లో నిలిచే, ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్న విశ్వక్‌సేన్. ఇంతకీ ఏమైంది..? వీరిద్దరి మధ్య అసలేం జరిగింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కుళ్లు జోకులు పేర్చి..!
వాస్తవానికి విశ్వక్ సేన్ అంటే.. వివాదాలకు కేరాఫ్ అనే పేరుంది. మైక్ పట్టుకున్నా.. మీడియా గొట్టాల ముందుకొచ్చినా సహనం కోల్పోయి మరీ ఏదో ఒక వివాదం రేపే వెళ్తాడు. అలాంటి ఈ కుర్ర హీరో తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ‘ఎఫ్-02’ సినిమాపై ఇష్టానుసారం మాట్లాడేసి.. సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ అనిల్ గాలి తీసేసినట్లుగా మాట్లాడేశాడు. ‘ఎఫ్-02 సినిమాలో కథే లేదు. పావుగంటకు మించి ఎక్కువ సేపు చూడలేకపోయాను. కుళ్లు జోకులు పేర్చి కమర్షియల్ సినిమాలకు అర్థం మార్చేశాడు. అయినా ఈ సినిమా హిట్టయ్యి.. వంద కోట్లు రాబట్టింది. ఇలాంటి కథలతో జనాన్ని మెప్పించడం కూడా ఓ టెక్నిక్. సినిమాలో విషయం లేకపోయినా ఆయింట్ మెంట్ పూసే ప్రయత్నం చేశాడ’ అని విశ్వక్ చెప్పుకొచ్చాడు.
ఎందుకిలా అతి మాటలు!?
అయితే ఈ సినిమా పరువు తీసిన విశ్వక్..‘కంచరపాలెం’ సినిమాను మాత్రం మెచ్చుకున్నాడు. వాస్తవానికి వెంకీ-వరుణ్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు వందకోట్లకు పైగానే కలెక్షన్స్ కూడా రాబట్టింది. అలాంటి ఈ సినిమాపై ఈ కుర్ర హీరో ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబో. అసలు అనిల్‌కు విశ్వక్‌కు ఏమైనా చెడిందా..? ఇలాంటి అతి మాటలు ఎందుకు మాట్లాడాడు..? లేకుంటే మొదట ఈ కథ ఆయన దగ్గరకెళ్లిందా..? అనేది మాత్రం తెలియట్లేదు కానీ.. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయ్. మరి ఈ కామెంట్స్‌పై అనిల్ ఎలా రియాక్ట్ అవుతాడో జస్ట్ వెయిట్ అండ్ సీ.