Advertisementt

థమన్ ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి!

Sun 05th Apr 2020 04:54 PM
ss thaman,surprise,pawan kalyan,follower,twitter  థమన్ ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి!
Biggest Fan moment to SS Thaman థమన్ ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నప్పటికీ.. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి ట్విట్టర్‌లో 3.9 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. ఆయన చాలా కొద్దిమందినే ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ లిస్ట్ లో చాలా కొద్దిమంది సెలబ్రిటీస్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ, సినిమాల్తో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే సెలబ్రిటీస్ లిస్ట్ లోకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ని కూడా చేర్చాడు పవన్ కళ్యాణ్. చిరు, మోడీ, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటుగా 32 మంది ని ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి థమన్ ని చేర్చి తన ఫ్యాన్ అయిన థమన్ ని సర్‌ప్రైజ్ చేసాడట.

శనివారం థమన్ లేచి తనకు వచ్చిన నోటిఫికేషన్ చూసుకుని షాకయ్యాడట. టాప్ హీరో పవన్ కళ్యాణ్ తనని ఫాలో అవ్వడం నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్న థమన్ ఆనందానికి అవధులే లేవు. ఇది నాకు అతి పెద్ద ఫ్యాన్ మూమెంట్ అని... నా రోజుని ఇంత అందంగా మొదలెట్టడానికి.. ఇంతకన్నా మంచి కారణం ఏం కావాలని, పవన్ సర్.. మీపై నాకు ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయని.. లవ్ యు సర్ అంటూ తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేసాడు థమన్. 

Biggest Fan moment to SS Thaman :

Pawan Kalyan Surprise to SS Thaman

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ