కనికా కపూర్.. కొన్ని రోజుల క్రితం వరకు కొంతమందికే పరిచయమైన ఈ పేరు ఒక్కసారిగా దేశమంతా మార్మోగిపోయింది. బాలీవుడ్ సింగర్ అయిన కనికాకి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. లండన్ నుండి ఇండియాకి తిరిగొచ్చిన కనికా క్వారంటైన్ లోకి వెళ్లకుండా పార్టీలకి హాజరవడం అందరి గుండెల్లో గుబులుని పుట్టించింది. ఆ పార్టీకి వచ్చిన వారంతా కనికాకి పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.
లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న కనికా చాలా రోజుల పాటు కరోనాతో పోరాడి ఎట్టకేలకు దాని నుండి బయటపడింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు కరోనా టెస్ట్ చేసినా పాజిటివ్ రావడంతో ఆమెలో ఆందోళన పెరిగి తన పిల్లలని చూడాలని ఉందని కోరిందట. భవిష్యత్తు ఏమౌతుందన్న గాభరాతో అన్నీ గుర్తొచ్చాయని.. జీవితం విలువ తెలిసిందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మరోసారి టెస్ట్ చేయడంతో నెగెటివ్ అని తేలిందట. ఎట్టకేలకు కనికా కపూర్ కరోనా నుండి బయటపడింది. దీంతో ఆమె సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెగెటివ్ వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉంటుందట. మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తారట.