రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం RRR సినిమా షూటింగ్స్ చివరి దశలో ఉండగా...కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ ఇంతవరకు RRR షూటింగ్ లో పాల్గొనలేదని.. ఇక కరోనా తర్వాత అలియా భట్ పెద్ద పెద్ద సినిమాల్తో అంటే బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది కాబట్టి.. RRR కి అలియా డేట్స్ ఇవ్వలేకపోవచ్చు అని.. RRR నుండి అలియా వాకౌట్ అంటూ... రాజమౌళి అలియా విషయంలో టెన్షన్ పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే గతంలోనే రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే చాలని చెప్పిన అలియా భట్ ఇప్పుడు కూడా RRR తర్వాతే మరేదన్నా అని అంటుందట. అయితే కరోనా లాక్ డౌన్ ముగిసాక.. RRR ఎప్పుడు మొదలైనా ముందుగా వచ్చి RRR షూటింగ్ పూర్తి చేస్తా అని.. ఆ తర్వాతే మరో సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటా అని అలియా భట్ RRR టీం కి చెప్పిందట. ఇక అలియా భట్ అలా చెప్పేసరికి రాజమౌళి తో పాటుగా RRR టీం కూడా ఫుల్ ఖుషీగా ఉందట. మరి అలియా భట్ - రామ్ చరణ్ ల రొమాన్స్ సినిమాలో మెయిన్ హైలెట్ గా ఉంటాయనే టాక్ ఉండడంతో.. అలియా ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.