లాక్ డౌన్ నేపథ్యంలో దేశప్రజలందరూ ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చూడని విధంగా తగ్గుముఖం పడుతుంది. కరోనా కారణంగా దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో లాక్ డౌన్ ని పాటిస్తున్న సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులకి వైద్యం అందించడంతో పాటు కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న రోజువారి కూలీల అవస్థలు తీర్చేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు.
టాలీవుడ్ నుండి చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు వచ్చిన సంగతి తెలిసిందే. రోజు వారి సినీ వర్కర్ల జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండేందుకే కాకుండా రాష్ట్రప్రభుత్వాలకి కూడా సాయం చేశారు. సెలెబ్రిటీలు చేసిన సాయాన్ని ప్రధాని మోదీ కూడా అభినందించాడు. అయితే సాయం చేయడానికి అందరూ హీరోలే ముందుకు వస్తున్న నేపథ్యంలో నయనతారు భారీ సాయాన్ని ప్రకటించింది.
ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా)కు ఆమె 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. హీరోయిన్ గా దక్షిణాదిన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార భారీ మొత్తాన్నే ప్రకటించి ఆమె ప్రత్యేకతని చాటుకుంది.